పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం కోసం ప్రత్యేక ఏర్పాట్లను సమీక్షించారు. వెస్ట్ జోన్ ఎసిపి పృద్వి తేజ్ , జోన్–8 జీవీఎంసీ కమిషనర్ హైమావతి పెందుర్తి పోలీసులు కలిసి మూడు చెరువులను పెందుర్తి వెల్ఫేర్ కాలేజ్ చెరువు, పెందుర్తి చెరువు, సరిపల్లి చెరువు పరిశీలించి, అవసరమైన ఏర్పాట్లను సమీక్షించారు.విగ్రహాల నిమజ్జన సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కఠినమైన భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలను సమకూర్చే విధంగా సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.