ఓర్వకల్లు మండలం వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలవి ఎంపీడీవో శ్రీనివాసులు సూచించారు. శనివారం ఓర్వకల్లులో ఆయన మాట్లాడుతూ వర్షకాలం కారణంగా డెంగీ, మలేరియా, విష జ్వరాల వ్యాప్తి చెందే అవకాశం ఉందని, నివారణకు ఓర్వకల్లు మండల ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. దోమల నివారించేందుకు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.