అవనిగడ్డ లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం పేదలకు భరోసా ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 17వ విడత చెక్కుల పంపిణీ జరిగింది. ఇద్దరు లబ్ధిదారులకు రూ.5,23,184లు రీయింబర్స్మెంట్ రూపంలో అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులను ముఖ్యమంత్రి పార్టీలకు అతీతంగా ఆమోదిస్తూ ఆర్థిక సహాయం అందిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.