రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ లోని శుక్రవారం దారమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోదండరాం నగర్ లోని రోడ్డు నెంబర్ 7లో శేఖర్ (40) హత్య చేయబడ్డాడు. పోలీసులు క్రైమ్ స్పాట్కు చేరుకొని విచారణ చేపట్టారు. భార్య చిట్టి ఆమె ప్రియుడుతో కలిసి ఈ దారుణానికి వడిగట్టినట్లు గుర్తించారు. చిట్టిని అదుపులోకి తీసుకోగా ప్రియుడు పరారు లో ఉన్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.