ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో 50 గౌడ కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు బహిష్కరించారు. దీంతో గౌడ కులస్తులు సోమవారం సాయంత్రం 4:15 ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు తరలివచ్చి ఫిర్యాదు చేశారు. గ్రామంలో కళ్ళు అమ్మడానికి ఉన్న ధర సరిపోక ధరలు పెంచుకుంటామంటే గ్రామానికి 10 లక్షలు ఇవ్వాలని లేదంటే తాము చెప్పినట్లు వినాలని వీడిసి సభ్యులు హుకుం జారీ చేశారని దీంతో మేము వినమని సమాధానం చెప్పడంతో గౌడ కులస్తులను గ్రామంలో వెలివేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.