ప్లాస్టిక్ నిషేధానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం నగర పాలక సంస్థ కమీషనర్ బాలస్వామి స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో నగరంలోని నగర పాలక సంస్థ కార్యాలయం లో నగరం లోని పేపర్ ప్లేట్స్ తయారీదారుల అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.