ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని వికారాబాద్ ఎమ్మెల్యే, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో మహాశివరాత్రి పురస్కరించుకొని శివ లింగాలతో ప్రధాన రోడ్డుపై శోభాయాత్ర నిర్వహించారు. మహాశివుడి కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరారు.