ఆలూరు మండలంలోని పెద్దపల్లి గ్రామానికి చెందిన ఎలేటి చిన్న సాయ రెడ్డి భార్య బుధవారం మధ్యాహ్నం 2:10 తమ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుండగా అక్కడికి వచ్చిన జావేద్ అనే యువకుడు బంగారం డబ్బులు ఇవ్వాల్సిందిగా ఆమెను ఒత్తిడి చేయగా ఆమె ప్రతిఘటించడంతో కత్తితో దాడి చేశాడు. వెంటనే మహిళ తన భర్తకు ఫోన్లో సమాచారం అందించగా సాయి రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొగా దుండవుడు పారిపోయినట్లు తెలిపారు. వెంటనే వెంబడించి పట్టుకొని గ్రామంలోకి తీసుకువచ్చి చితకబాది పోలీసులకు సమాచారం అందించారు