Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 28, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో గురువారం ఉదయం 11 గంటలకు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భవించి 18 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ జెండావిష్కరించినట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు చంద్రమౌళి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వికలాంగులకు 6000 పెన్షన్ పెంచాలని,వృద్ధులకు ₹4,000 పెంచాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 9న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించే వికలాంగుల చేయూత పెన్షన్ మహాగర్జనలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగ సోదరులు హాజరై విజయవంతం చేయాలన్నారు అంబాల చంద్రమౌళి.