పల్నాడు జిల్లా, శావల్యాపురం మండలం, కనమర్లపూడికి చెందిన రాణికి విద్యుత్ షాక్ తగిలి అవయవాలు దెబ్బతిన్నాయి. ఆమె మంచానికే పరిమితమై తన పనులు కూడా చేసుకోలేని పరిస్థితి. గతంలో ఆమెకు 85% నుంచి 100% దివ్యాంగుల కోటా కింద రూ.15 వేల పింఛన్ అందేది. ఇటీవల జరిగిన పింఛన్ వెరిఫికేషన్లో అధికారులు ఆమె సర్టిఫికేట్లో దివ్యాంగుల శాతం తగ్గించడంతో పింఛన్ రూ.6 వేలకు తగ్గింది.అధికారుల తప్పిదం వల్ల నష్టపోయానని ఆదివారం మధ్యాహ్నం 12గంటాలకు బాధితురాలు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది.