ఆదోనిలో గురువారం అర్ధరాత్రి పందుల దొంగలు పోలీసులకు చిక్కారు. అందిన సమాచారం ఆధారంగా 1 టౌన్ సీఐ శ్రీరామ్ ముగ్గురు వ్యక్తులు, వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో గొర్రెలు, మేకలు, పందుల దొంగతనాలకు వీరే కారణమని పోలీసులు తెలిపారు. మూడు సంవత్సరాల క్రితం ఆదోనిలో యువకుడిని ఢీకొట్టి చంపిన ఘటనలో కూడా వీరిపై కేసు ఉంది. పలు స్టేషన్లలో కేసులు ఉండటంతో వీరు మోస్ట్ వాంటెడ్ దొంగలుగా గుర్తింపు పొందారు.