నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి నీ విమర్శించిన మంత్రి సవిత కు ఈరోజు మాజీ మంత్రి శంకర్ నారాయణ కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి నీది కాదు అంటూ హెచ్చరించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఉల్లికి, ఉల్లిగడ్డకు తేడా తెలియదంటూ విమర్శించడం సరికాదు అంటూ ఆయన ధ్వజమెత్తారు. ఇంకో ఆరు నెలల్లో మంత్రి పదవి ఊసిపోతుందంటూ వస్తున్న ప్రచారం తో, చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు పొందడం కోసం జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమంటూ ఆయన హెచ్చరించారు