రైతులు పండించిన పత్తి పంటకు జాతీయ రైతుల కమిషన్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన సిఫార్సు చేసిన సమగ్ర సి+2+50 ఖర్చుల సూత్రాన్ని ఉపయోగించి క్వింటాలకు 10,075 రూపాయలు మద్దతు ధర కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు శనివారం తనికెళ్ల సిపిఐ కార్యాలయంలో గుమ్మడేల్లి సైజేశ్వరరావు అధ్యక్షుతన జరిగిన రైతు సంఘ సమావేశంలో వారు పాల్గొని ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగుమతులు సుంకాన్ని తొలగించడం వల్ల భారతదేశ అంతట 60 లక్షల పత్తి రైతు కుటుంబాల జీవన ఉపాధి మరింత దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు .