త్రిబుల్ ఆర్ రోడ్డు పాత అలైన్మెంట్ ప్రకారమే కొనసాగించాలని నవాబుపేట మండల రైతులు డిమాండ్ చేశారు గురువారం వికారాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నవాబుపేట రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేతల భూములకు ప్రాధాన్యం కల్పించి వారి వెంచర్లకు మేలు చేయాలని ఉద్దేశంతోనే మార్పులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే ప్రజలకు సౌకర్యం ఉన్న మార్గాన్ని మార్చి కొత్త అలాన్మెంట్ పెట్టడం స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు