ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన సురేంద్ర అనే వ్యక్తి కుటుంబ సమస్యల కారణంగా శనివారం తాను చనిపోతున్నానని చెప్పి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ అంకమ్మరావు ఐటీ కోర్ టీం సహాయంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సురేంద్ర ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. వెంటనే రైల్వే ట్రాక్ వద్దకు చేరుకొని అతని ప్రాణాలను కాపాడారు.