అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని మంగళవారం సాయంత్రం 4గంటలకు తెలంగాణ చౌరస్తా వద్ద విద్యార్థులతో కలిసి మానవ హారం కార్యక్రమం చేయడం జరిగినది. ఈ సందర్భంగా ABVP కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని విద్యార్థులకు రావలసిన ఫీజులను 8700 కోట్లను పెండింగ్ లో పెట్టిందని.. తద్వారా విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లాలంటే కళాశాల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విదార్థుల దగ్గరి నుండి వసూలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.