శ్రీశైలం నాగార్జునసాగర్ గేట్లు ఎత్తడంతో పులిచింతల ప్రాజెక్టుకు ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భారీగా వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 6.86 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 5.86 లక్షల క్యూసెక్కుల నీరు దిగు విడుదల చేస్తున్నట్లు ఈఈ గుణాకర రావు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 38.36 మీటర్ల మేర నీటిమట్టం ఉండగా నాలుగు మీటర్ల ఎత్తులో 18 గేట్లను తెరిచి నీటిని విడుదల చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు.