ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పంచాయతీ అధికారిణి శాంతాలక్ష్మి సూచించారు. అల్లవరం మండలం, బోడసకుర్రు లో పంచాయతీ అధికారులు సిబ్బంది తో కలిసి పర్యటించి, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తడి, పొడి చెత్తలను వేర్వేరుగా చేసి క్లాఫ్ మిత్రులకు అందించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి, కార్యదర్శి ఆదిశంకరం తదితరులు పాల్గొన్నారు.