విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాయ్‌పూర్‌కు వెళ్ళాల్సిన ఇండిగో విమానం బుధవారం గంటన్నర ఆలస్యంగా బయలుదేరింది. ఉదయం 11 గంటలకు బయలుదేరాల్సిన విమానం టెక్నికల్ సమస్య కారణంగా నిలిచిపోయింది. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక ప్రయాణికుడు అత్యవసర ద్వారం తెరిచాడు. దీంతో, విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఫలితంగా, విమానం బయలుదేరడం ఆలస్యమైంది. సాంకేతిక సమస్యను పరిష్కరించిన తర్వాత, మధ్యాహ్నం 12:30 గంటలకు విమానం రాయ్‌పూర్‌కు బయలుదేరినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు.