కామారెడ్డి జిల్లాలో వరుసగా కురిసిన వర్షాల ప్రభావంతో రాజంపేట మండలంలో జరిగిన పంట నష్టాన్ని మండల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. మండల వ్యాప్తంగా పంట నష్టం వివరాలను త్వరగా సేకరించి రైతులకు నష్టపరిహారం అందే విధంగా చూడాలన్నారు. అలాగే రాజంపేట మండల కేంద్రం నుంచి ఆరుగొండ గ్రామానికి వెళ్లే రోడ్డున పరిశీలించారు. రోడ్డు మరవత పనులను త్వరగా పూర్తిచేయాలని రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులకి ఆదేశాల్ని కలెక్టర్ జారీ చేశారు.