ఖానాపూర్ మండలం సుర్జాపూర్ గ్రామానికి చెందిన షేక్ అల్మీయ అనే రైతు పంట పొలంలో ఆదివారం తెల్లవారుజామున అడవి పందులు దాడి చేశాయని బాధిత రైతు వాపోయారు. అడవి పందుల దాడిలో ఎకరం మొక్కజొన్న,పత్తి,పసుపు పంటలను తీవ్రంగా ధ్వంసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. అడవి పందులను తరిమి ఎందుకు వెళ్లిన రైతుపై సైతం పందులు దాడికి ఎత్నించడంతో బాధిత రైతు తప్పించుకొని ప్రాణాలను కాపాడుకున్నట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు షేక్ ఆల్మియా కోరుతున్నారు.