శ్రావణమాసం చివరి శుక్రవారం కావడంతో రాయదుర్గం నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో మహిళలు సామూహిక వరమహాలక్ష్మి వ్రతము ఆచరించారు. పట్టణంలోని శ్రీ హాటకేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరి మహిళా మండలి ఆధ్వర్యంలో ఉదయం నుంచి మద్యాహ్నం వరకూ వరమహాలక్ష్మి వ్రతము భక్తిశ్రద్దలతో నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వర మహాలక్ష్మి వ్రతం ప్రాముఖ్యతను వివరించారు. అమ్మవారి కీర్తనలు, భజనలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి కుంకుమార్చన జరిపారు. మహా మంగళహారతి అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.