నల్లగొండ జిల్లా: రైతాంగం పంట పొలాలను కాపాడుకోవడం కోసం యూరియా సకాలంలో అందించండి అని రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు యూరియా కష్టాలు రైతుల గోడు పట్టవా అని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మంగళవారం ధ్వజమెత్తారు. రైతులకు సకాలంలో యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిపిఎం ఆ కార్యాలయం నుంచి జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం వరకు సిపిఎం పార్టీ శ్రేణులు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.