యూరియా నిల్వలు ఉంచుకుని కొంతమంది వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. వాటిని అరికట్టి రైతులందరికీ యూరియా అందుబాటులో తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు చేపట్టారు. సోమవారం కడప జిల్లా జమ్మలమడుగు లోని పలు ఎరువుల దుకాణాలపై దాడులు జరిపి రికార్డులు పరిశీలించారు.యూరియా విక్రయించకుండా కృత్రిమ కొరతను సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.ఈ సందర్బంగా ఉమ్మడి కడప జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పి శ్రీనివాసరావు వివరాలు తెలిపారు.