వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్సీ మహిళలకు శనివారం ఉచిత కుట్టుమిషన్లు తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రతి గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఇప్పటివరకు మహిళలకు అనేక పథకాలు అమలు చేసిందని, మహిళలు ప్రతి ఒక్కరూ తమ కాళ్లపై ఆర్థికంగా నిలబడేందుకు కుట్టుమిషన్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని దానిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.