మీర్ పేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో గురువారం మధ్యాహ్నం ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఊహించని రీతిలో కురిసిన వర్షానికి పంట పొలాలకు తీవ్ర నష్టం ఏర్పడిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో సర్వే చేయించాలని అన్నారు. నీట మునిగిన ఇల్లు ముంపు ప్రాంతంలో చిక్కునుక్కున్న వారిని బయటికి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని అన్నారు. నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు.