తెలంగాణ నూతన మద్యం పాలసీ (2025-27 )లో భాగంగా జిల్లాలో 49 మద్యం షాపుల నిర్వహణకు ఎస్సీ, ఎస్టీ మరియు బిసి గౌడ కులస్తుల రిజర్వేషన్ ఎంపిక కొరకు గురువారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో వీడియోగ్రఫీ మధ్య జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ, ఎస్టీ అభివృద్ధి శాఖ మరియు బీసీ అభివృద్ధి శాఖల అధికారుల సమక్షంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వారు డ్రా నిర్వహించారు.జిల్లాలో మొత్తం 49 మద్యం దుకాణాలు ఉండగా వాటిలో 05 ఎస్సీ సామాజిక వర్గానికి, 02 ఎస్టీ సామజిక వర్గానికి మరి ఏడు బిసి గౌడ కులలకు లాటరీ ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపారు.