కోడుమూరు పట్టణంలోని పలు రసాయనిక ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా యూరియా స్టాక్ లను పరిశీలించారు. యూరియా నిల్వలు, ఈపాస్ మిషన్ బ్యాలెన్స్ సరిచూశారు. ఉరుకుంద రైతు డిపో దుకాణంలో ఈపాస్ మిషన్, ఫిజికల్ బ్యాలెన్స్ లో తేడా ఉండడంతో అమ్మకాల నిలుపుదలకు ఆదేశించారు. అలాగే బిల్లుల్లో రైతుల సంతకాలు లేకపోవడంతో ఏడిఏ షోకాజ్ నోటీసు ఇచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రవి ప్రకాష్ పాల్గొన్నారు.