ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని టిడిపి కార్యాలయం నందు టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు ఆధ్వర్యంలో వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. సుమారు 46 మందికి 26 లక్షల ఐదువేల తొమ్మిది వందల ఇరవై రూపాయల చెక్కులను అందజేసినట్లు ఎరిక్షన్ బాబు తెలిపారు. అంతేకాకుండా ముగ్గురికి ఎల్వోసీలు మరో ఇద్దరికి ప్రమాద బీమా కింద పది లక్షల రూపాయలు అందజేసినట్లు తెలిపారు. ఆపదలో అండగా నిలిచి ముఖ్యమంత్రి సహాయ నిధిని మందులు చేసిన సీఎం చంద్రబాబు సహాయాన్ని మరవకూడదని అన్నారు.