ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పరీక్షల్లో పాల్గొనేలా హెచ్ఎంలు కృషి చేయాలని డీఈవో భోజన్న అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పరీక్షకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞాన మంథన్ (వీవీఎం) పేరుతో జాతీయస్థాయిలో ప్రతిభాన్వేషన్ పరీక్ష నిర్వహిస్తోందని తెలిపారు. ఇందులో జిల్లా కోఆర్డినేటర్ లు నాగుల రవి, రాజేశ్వర్, ఏఎంఓ నర్సయ్య, సీఎంఓ ప్రవీణ్, ఏఎస్సీ లింబాద్రి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.