వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు లక్ష్మణచాంద మండలం మునిపెల్లి, మాచాపూర్ గ్రామాలకు చెందిన సుమారు 300 బర్రెలు గోదావరి మధ్యలోని కుర్రులో చిక్కుకున్నాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహించడంతో పశువులు బయటకు వెళ్లలేక కుర్రులోనే ఉండిపోయాయి. సోమవారం గోదావరి శాంతించడంతో కొందరు గ్రామస్తులు ధైర్యం చేసి కుర్రుకు వెళ్లి బర్రెలను గోదావరి దాటించారు. దీంతో మాచాపూర్, మునిపెల్లి గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వారం రోజులు గోదావరి మధ్యలో చిక్కుకున్న పశువులు క్షేమంగా ఇండ్లకు చేరుకోవడం పట్ల పశువుల యజమానులు