సదాశివపేట మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి సెప్టెంబర్ 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సదాశివపేట ఎంఈఓ శంకర్ సూచించారు. శనివారం సదాశివపేట ఎమ్మార్సీ కార్యాలయంలో జరిగిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ పురస్కారానికి ఆరు విభాగాల్లో 20 ప్రశ్నలకు సమాధానాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలు కూడా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.