రణస్థలం మండలం పైడిభీమవరం విద్యుత్ సబ్ స్టేషన్ లో నూతనంగా నిర్మించిన ఏఈ కార్యాలయాన్ని శుక్రవారం ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ప్రారంభించి మాట్లాడారు. విద్యుత్ సిబ్బంది లైన్లలో తిరిగి సమస్యను ముందుగా గుర్తించాలన్నారు. మరమ్మతులు చేసి అంతరాయం లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈ రాజేష్, ఏఈ లు తిరుపతిరావు, అప్పన్న తదితరులు పాల్గొన్నారు.