తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందని మత్స్యకారుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. గత రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే వర్మ మత్స్యకారుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని వెళ్లారు. కాగా సోమవారం మత్స్యకారుల సమస్యలపై మంత్రి అచ్చయ్య నాయుడు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలితో కలిసి సమస్యలు వివరించారు అనంతరం మీడియాతో మాట్లాడారు.