గ్రేటర్ హైదరాబాదులోని జోనల్ వర్క్ షాపును ఉప్పల్ నుంచి కరీంనగర్ కు తరలించరాదని బహుజన కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వాన్ని కోరారు. జోనల్ వర్క్ షాపులో దాదాపు 400 మంది పనిచేస్తున్నారని, ఇది రాష్ట్రంలోని అన్ని డిపోలకు సమాన దూరంలో ఉందని, కరీంనగర్కు తరలిస్తే డీజిల్ వృధాతో పాటు కార్మికులకు ఇబ్బందులు తప్పవని వారు తెలిపారు.