ఆళ్లగడ్డ మండలం బాచాపురం, సిరివెళ్ల మండలం గుంప్రమాని దీన్నేగ్రామాలలో ఆకుల పెద్ద శ్రీనివాసులు, ముక్కమల్ల గోపాల్ రెడ్డి ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలకు అండగానిలిచి ఆర్థిక సహాయం అందజేశారని పార్టీ నాయకులు అన్నారు. జనసేన సమన్వయకర్త మైలేరి మల్లయ్య ఆధ్వర్యంలో గురువారం ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేశారు.