అవనిగడ్డలో 30 ఎకరాల వరిగడ్డి వామి అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. నివాస గృహాల మధ్య ముగ్గురు రైతులకు చెందిన గడ్డివామి ఒక్కసారిగా తగలబడటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఎవరో కావాలని తగులబెట్టారని రైతు రంగారావు అనుమానం వ్యక్తం చేశారు.