పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరిత రెడ్డి సుమారుగా రూ.6,48,599 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంగళవారం కల్లూరు అర్బన్ పరిధిలోని మాధవి నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని గడ్డం సురేష్, వంగాల వెంకటేశ్వరమ్మ, ఎల్లమ్మ చైల్డ్ సహా 11 మంది లబ్ధిదారులకు ఈ సహాయం అందించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు.