కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని సంగమేశ్వర్ గ్రామం వద్ద బుధవారం వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన బాలరాజు మృతదేహం శుక్రవారం లభ్యమైనది. రోడ్డు నుండి కిలోమీటర్ కు పైగా ఉన్న మృతదేహాన్ని పోలీసులు గ్రామస్తులు కలిసి తీసుకువచ్చారు. అనంతరం పోస్టుమార్టం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.