ఎలాంటి అనుమతులు లేకుండా కరీంనగర్ నగరపాలక సంస్థ ద్వారా తెలంగాణ చౌక్ సమీపంలోని మల్టీ పర్పస్ పార్క్ లో మున్సిపల్ లో ఎలాంటి అనుమతి లేకుండా విరుద్దంగా ఏర్పాటు చేసిన క్వాలిటీ హోటల్, దాభాను తొలగించునట్లు కరీంనగర్ మున్సిపల్ కమీషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం రాత్రి 8గంటలకు మున్సిపల్ కమీషనర్ ఆదేశాలతో క్వాలిటీ హోటల్,దాభాకు సంబంధించిన బోర్డులు తొలగించారు. పార్క్ అభివృద్ధి చేసి ఓ ప్రైవేట్ ఏజెన్సీకి నిబంధనల ప్రకారం షరతులతో టెండర్ ద్వారా లీజుకు ఇవ్వడం జరిగింది.అట్టి పార్కు పరిదిలో కేవలం క్యాంటీన్ ఏర్పాటు చేసి నడపడానికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగిందని స్పష్టం చేసారు మున్సిపల్ కమీషనర్.