విద్యారంగంలో ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని, అవకాశాన్ని వినియోగించుకొని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. బుధవారం సాయంత్రం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో ముందస్తుగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ఉపాధ్యాయులు తల్లి లాంటి వారని, వారు పిల్లలను ఆదరించి చక్కటి విద్యాబుద్ధులు నేర్పాలని అన్నారు. చాలామంది పేద, మధ్యతరగతి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వస్తారన్నారు.