ఓర్వకల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఓర్వకల్లులో వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. HM . రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మహర్షి చిత్రపటానికి పుష్పాంజలి అర్పించారు.ఈ సందర్భంగా, వాల్మీకి జీవితం రత్నాకరుడిగా ప్రారంభమై మహర్షిగా మారిన మార్గం, రామాయణ రచన వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కలిగించబడింది.తెలుగు ఉపాధ్యాయురాలు నాగేంద్రమ్మ మాట్లాడుతూ, నేటి తరం వారు వాల్మీకి వంటి మహానుభావుల జీవితాల నుండి స్ఫూర్తి పొందాల్సిన అవసరాన్ని వివరించారు