ఏలూరు జిల్లా పోలవరం మండలం ప్రగడపల్లి గ్రామంలో గురువారం ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కారు. యూరియా అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎరువులు తక్షణం అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నాకు దిగారు. సంబంధిత అధికారులు సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.