సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు జిల్లా వ్యాప్తంగా పనిచేసే గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు 25 నెలలు పెండింగ్ జీతాలు ఇవ్వాలని కోరుతూ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రన్ అధ్యక్షతలో ధర్నా నిర్వహించారు కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన గ్రీన్ అంబాసిడర్ కార్మికుల సమస్యల పరిష్కారం కాలేదని వాపోయారు కార్మికులు పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేస్తున్నప్పటికీ గ్రామస్తులకు ఆరోగ్యపరంగా కాపాడుకొంటూ పనులు చేస్తున్నప్పటికీ ప్రతినెలా ఇచ్చే 6000 రూపాయల వేతనాన్ని కూడా పూర్తిస్థాయిలో ప్రభుత్వం చెల్లించకపోవడం బాధాకరమన్నారు.