కరీంనగర్ స్మార్ట్ సిటీలో అంత్యక్రియలు జరుపుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గురువారం జోరువానలో ఓ మహిళ అంత్యక్రియలు దయనీయ స్థితిలో జరిపారు. వివరాల్లోకి వెళితే..గురువారం మధ్యాహ్నం భారీ వర్షంలో బోయవాడ శాస్త్రి రోడ్డుకు చెందిన మాడిశెట్టి లక్ష్మీ చనిపోతే అంత్యక్రియలు కోసం కేబుల్ బ్రిడ్జి సమీపంలోని స్మశాన వాటికకు వెళ్తే స్మశాన వాటికి మృతదేహాన్ని తీసుకువెళ్తే చితిపేర్చి మృతదేహాన్ని చితిపై పెట్టిన తర్వాత భారీ వర్షం పడింది. స్మార్ట్ సిటీ వైకుంఠదామంలో ఎలాంటి సౌకర్యాలు లేవని చితి పైకప్పు కూడ లేకపోవడంతో శవాన్ని కాల్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు.