కాకినాడజిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురంలో ఏగులమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది.అమ్మవారు గ్రామ దేవత కావడంతో ఊరేగింపు కార్యక్రమం గ్రామంలో నిర్వహించారు.ముందుగా గరగల సంబరం ఘనంగా గ్రామంలో జరిగింది..అనంతరం ఆలయం వద్దకు చేరుకుని భక్తులు వారి మొక్కుబడులు చెల్లించుకున్నారు