కామారెడ్డి జిల్లాలో ఎస్.సి. కార్పొరేషన్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న టి. దయానంద్ బదిలీపై నిర్మల్ జిల్లా ఎస్.సి. అభివృద్ధి అధికారి (DSCDO)గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ను మర్యాదపూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేశారు. దయానంద్ కు శుభాకాంక్షలు తెలియజేసిన కలెక్టర్, క్రమశిక్షణతో పనిచేస్తూ, షెడ్యూలు కులాల అభివృద్ధి కోసం ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి, మరింత మందికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.