తాడిపత్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దఎత్తున వేడుకలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పక్కన ఇన్ఛార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. పెద్దపప్పూరు, యాడికి, పెద్దవడుగూరు, తాడిపత్రి మండలాల నుంచి పెద్దఎత్తున జన సైనికులు హాజరై రక్తదానం చేశారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా రక్తదానం చేశామని చెప్పారు