వృద్ధురాలుపై కోతులు దాడి వైరా మున్సిపాలిటీలోని పదో వార్డు గండగలపాడులో ఓ వృద్ధురాలు పై కోతులు దాడి చేసి గాయపరిచిన సంఘటన చోటుచేసుకుంది. గండగలపాడుకు చెందిన ఇనపనూరి దేశమ్మ ఉదయం తను ఇంటిలో పనులు చేసుకుంటున్న క్రమంలో ఒక్కసారి కోతులు గుంపు దాడి చేయడంతో తీవ్ర గాయాలైనాయి.స్థానికులు పరిశీలించి వృద్ధురాలని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో గండగలపాడు గ్రామస్తుల పై ప్రతిరోజు ఎవరినో ఒకరిని పై దాడి చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ గండగలపాడు గ్రామంపై దృష్టి పెట్టి కోతులను కుక్కలపై కుక్కలను నిర్మూలించాలని కోరుతున్నారు.