అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రసిద్ధ కటిక జలపాతం చేరుకునే రోడ్డు పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఐదు సంవత్సరాల క్రితం అరకులోయ నుండి సుంకరమెట్ట మీదుగా కటిక జలపాతం వరకు 7 కిలోమీటర్ల రోడ్డు వేసినప్పటికీ, ప్రస్తుతం అది పూర్తిగా దెబ్బతింది.ముందుగా పర్యాటకుల సౌలభ్యం కోసం “ములియగుడ” జంక్షన్ నుండి వెళ్లే మార్గం కంటే 10 కిలోమీటర్ల దూరం తగ్గించడమే లక్ష్యంగా ఈ రోడ్డు నిర్మించారు. దీంతో అరకు నుండి కటిక జలపాతం దూరం 14 కిలోమీటర్లు తగ్గింది. కానీ నిర్మాణ సమయంలో నాసిరకమైన పనులు జరగడంతో, ఇప్పుడు రోడ్డంతా గుంతలతో నిండిపోయి వాహనాలు వెళ్లలేని స్థితి ఏర్పడింది.